‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ : మంచు మనోజ్‌

-

మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య గొడవలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ నిన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం నెట్టింట్లో హడావిడి రేపింది. తండ్రి మోహన్ బాబు మనోజ్ పై మండిపడడంతో ఆ మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సహజమేనని అన్నారు మంచు విష్ణు. దీంతో వివాదం కాస్త చల్లబడింది.

ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మాత్రం ట్విట్టర్ లో మరో ఆసక్తికర పోస్టు చేశారు. ‘‘బతకండి.. బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా’’ అని ట్వీట్ పోస్ట్ చేశారు ఆయన . కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు మంచు మనోజ్. అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ ‘‘అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’’ అని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మనోజ్. ‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ అంటూ అమెరికన్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిన మరుసటి రోజే మనోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version