ప్రకాష్ రాజు కు బిగ్ షాక్ :మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ !

మా అసోసి యేషన్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. అక్టోబర్ 10 న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని ఈ లేఖలో పేర్కొన్నారు హీరో మంచు విష్ణు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని.. మంచు విష్ణు పేర్కొన్నారు. ఈవీఎంల పై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని వెల్లడించారు మంచు విష్ణు.

పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని.. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్ లో పారదర్శకత ఉంటుందన్నారు. ఈ వీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు మంచు విష్ణు. పేపర్ బ్యాలెట్ కల్పి స్తే సీనియ ర్లు చాలా మంది ఓటు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు మంచు విష్ణు. కాగా అక్టోబర్ 10 వ తేదీన మా అసోసి యేషన్ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.