మాజీ మంత్రి , సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. మరో మూడు రోజుల్లోనే… మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో… గులాబీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవ్వాళ ఉదయం అసెంబ్లీకి స్వయంగా మోత్కుపల్లి నర్సింహులును వెంటబెట్టుకుని వచ్చారు సీఎం కేసీఆర్. ఉదయం నుంచి సీఎం కేసీఆర్ తోనే మోత్కుపల్లి నర్సింహులు అసెంబ్లీ లో ఉన్నారు.
టిఆర్ఎస్ పార్టీలో మరో మూడు రోజుల్లో మోత్కుపల్లి నరసింహులు చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు తర్వాత… దళిత బందు చైర్మన్ గా మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. మోత్కుపల్లి నర్సింహులుకు ఆ పదవి కట్టబెడితే… హుజూరాబాద్ నియోజకవర్గం లో దళితుల ఓట్లు పూర్తిగా టిఆర్ఎస్ కు వచ్చే అవకాశాలు ఉంటాయనే యోచనలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.