కాంగ్రెస్ మాకు మద్దతిస్తే వారికి మేం అండగా ఉంటాం : మందకృష్ణ మాదిగ

-

ద్ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు.ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ నేతలకు సోమవారంనాడు లేఖ అందించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.

Stir for SC categorisation: MRPS plans Sadak bandh on July 2

వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతిస్తేనే అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయమన్నా రాయడం లేదన్నారు. తాను తొమ్మిదేళ్లుగా వీరిచుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటులో ప్రయివేటు బిల్లు పెట్టవచ్చు కదా అన్నారు. అలాంటప్పుడే ఆ పార్టీకి మద్దతివ్వగలమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news