ఎవ‌రు కావాలో ఆలోచించుకోండి.. ఆగం కాకండి : మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు.. ఆ పార్టీ మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుంభకోణాలే ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ చేయబోయేది రైతు మేళా కాదు కుభకోణాల మేళానే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభం, శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ అక్కడే జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ.. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ చేసింది ఏమి ఉన్నది.. అవే పాత ముఖాలు పెట్టుకొని నియోజకవర్గాని వస్తారు. అంతే తప్ప వాళ్లు ప్రజలకు చేసేది ఏమీ ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గడప గడపకు అంటూ వస్తున్నారు.. ఇంతకు వాళ్లు గడప గడపకు ఏం ముఖం పెట్టుకొని వస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

Telangana minister KTR leaves for US to attract investments

కేసీఆర్ మూడు పంట‌లకు నీళ్లు ఇస్తున్నా అంటుండు.. 24 గంట‌ల క‌రెంట్ ఉచితంగా ఇస్తున్నా అంటుండు. కాంగ్రెసోళ్లేమో మూడు గంట‌లు క‌రెంట్ అంటున్నారు. బీజేపోళ్లు హిందు, ముస్లిం అంటరు త‌ప్ప వారికి ఇంకో మాట రాదు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రు కావాలి మీకు.. మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తానంటున్న కాంగ్రెసా.. మూడు పంట‌లు ఇస్తానంటున్నా కేసీఆరా.. మ‌తం పేరిట మంట‌లు పెడుతానంటున్న బీజేపీనా.. ఎవ‌రు కావాలో ఆలోచించండి.. ఆగం కాకండి.. రాబందులు కావాల్నా.. రైతుబంధు కావాల్నా ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news