కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. మణిపూర్ సాంఘిక సంక్షేమ సహకార శాఖ మంత్రి నెమ్చా కిప్జెన్ కరోనా బారిన పడ్డారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఈ విషయన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. అలాగే ఇటీవల కాలంతో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా, మణిపూర్‌లో కరోనా బారిన పడ్డ తొలిమంత్రిగా నిలిచారు నెమ్చా కిప్జెన్.