మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట

-

నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల నేతన్న వస్త్రం తలుక్కున మెరిసింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. చేనేత కార్మికుడు హరిప్రసాద్ జి-20 పేరుతో చేతితో స్వయంగా నేచిన వస్త్రాన్ని నరేంద్ర మోడీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కల నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని అభినందించారు.

సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ నాకు లేఖ రాశారని, g20 కి సంబంధించిన నాకు మంచి సూచనలు చేశారని తెలిపారు. జి20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టడం గర్వకారణం అని అన్నారు ప్రధాని. త్వరలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ రాబోతుందన్నారు. విద్యార్థులు జి-20 కూటమి లక్ష్యాలను తెలుసుకోవాలన్నారు. ఇక మన్ కీ బాత్ కార్యక్రమంలోని ప్రధాని ప్రసంగాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తిగా తిలకించారు.

Read more RELATED
Recommended to you

Latest news