భారత ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ నారవాణే స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ను కేంద్ర మంత్రి వర్గం ఎంపిక చేసింది. కాగ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నారవాణే.. ఆర్మీ చీఫ్ గా పదవీ విరమణ ఈ నెల 30వ తేదీన చేయనున్నారు. దీని తర్వాత ఆర్మీ చీఫ్ గా నూతనంగా ఎంపిక అయిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30వ తేదీనే బాధ్యతలు చేపట్టనున్నారు. కాగ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఒక ఆర్మీ చీఫ్ స్థాయి వరకు వెళ్లడం ఇదే తొలిసారి.
మనోజ్ పాండే తో పాటు.. జై సింగ్ నయన్, అమర్ దీప్ సింగ్ భిందర్, యోగేద్ర దిమ్రీ పేర్లను కేంద్ర కాబినెట్ నియామకాల కమిటీ పరిశీలించింది. కానీ ఈ ఇంజినీర్ వైపె కేంద్ర మంత్రి వర్గం నియామకాల కమిటీ మొగ్గు చూపింది. కాగ బిపిన్ రావత్ మరణం తర్వాత సీడీఎస్ ను పదవిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఇప్పుడు ఈ పదవిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఆ స్థానంలో జనరల్ నారవాణే ను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తునట్టు సమాచారం. అందుకే ఆర్మీ చీఫ్ నుంచి నారవాణే తప్పకున్నట్టు తెలుస్తుంది.