పవన్ నటించిన బ్రో సినిమా విడుదల అయ్యి రెండవ వారం జరుగుతున్నా ఇంకా వార్తలలో ఉంది. ఈ సినిమాలో ఉద్దేశపూర్వకంగానో లేదా యాదృచికంగానో ఒక పాత్రను సృష్టించారు. అయితే దురదృష్టవశాతూ ఆ పాత్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నటుడు పృథ్వి చేత బ్రో సినిమాలో పబ్ లో డ్యాన్స్ లు వేయించిన దృశ్యాలు అచ్చం మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి చేయించారని ఆయన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక జనసేన సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు.. తాజాగా చిరంజీవి ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎందుకు సినిమా పరిశ్రమపైన పడుతున్నారు, రాజకీయాలను సినిమాలతో కలపకండి అన్నారు. దీనికి మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ చిరంజీవి గారు ఈ విషయం ముందుగా మీరు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చెబితే బాగుటుంది అంటూ ఉచిత సలహా ఇచ్చాడు, ఎందుకంటే ముందుగా బ్రో సినిమాలో రాజకీయాలను కలిపింది మీ తమ్ముడు అంటూ మాట్లాడారు.
మరి దీనిపై చిరంజీవి ఏమైనా స్పందిస్తారా లేదా ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుంది అన్నది తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.