జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్న పేరుతో ఇప్పటికే రెండు విడతలుగా ప్రజలను వివిధ ప్రాంతాలలో కలుస్తూ వచ్చే ఎన్నికలకు పార్టీకి మంది మైలేజ్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే మూడవ విడత వారాహి యాత్ర విశాఖపట్టణం నుండి స్టార్ట్ చేయాలని అధికారికంగా డేట్ ను కూడా ప్రకటించారు. తాజాగా ఈ వారాహి యాత్ర గురించి వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో పవన్ పై రెచ్చిపోయి మాట్లాడారు. ఈయన ఎందుకు విశాఖ వస్తున్నారో తెలియడం లేదన్నారు. ఒకవైపు బీజేపీతో సంసారం మరియు టీడీపీతో సహజీవనం చేస్తున్న పవన్ ఇప్పటి వరకు ఏమిచేశారని ప్రశ్నించారు అమర్నాధ్. గాజువాక లో ఓడిపోయినందుకు యాత్ర చేస్తున్నారా అంటూ సెటైర్ వేశారు మంత్రి.
ఎందుకు అర్ధం పర్థం లేని యాత్రలు చేయడం , గెలిచిన వారు లేదా ప్రజలకు న్యాయం చేసిన వారి ఇలాంటి యాత్రలు చేస్తుంటారు కానీ పవన్ ఉత్తరాంధ్రకు ఏమిచేశాడని యాత్రకు వస్తున్నదంటూ అమర్నాధ్ ప్రశ్నించారు.