కాంగ్రెస్ ఎలక్షన్ ప్లాన్..3 కేటగిరీల్లో సీట్లు.!

-

గత రెండు పర్యాయాలు తెలంగాణలో గెలుపుకు దూరమైన కాంగ్రెస్..ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ని ప్రజలు పట్టించుకోలేదు. రెండు సార్లు తెలంగాణ తెచ్చిన కే‌సి‌ఆర్ వైపే మొగ్గు చూపారు. అయితే కే‌సి‌ఆర్ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగింది ఏమి లేదని కాంగ్రెస్ అంటుంది. అందుకే ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుంది.

ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు పకడ్బంధిగా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే బలమైన నేతలని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టేలా స్కెచ్ వేస్తున్నారు. మొదట జాతీయ నాయకులని తీసుకొచ్చి భారీ సభలు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే ఎస్సీ, బీసీ, మహిళా డిక్లరేషన్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ప్రజా రంజకమైన మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక హామీలని ఇచ్చారు.

ఇక సర్వేల ఆధారంగా 119 సీట్లని మూడు కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుచుకునే సీట్లు 41 అని సొంత సర్వేలో తేలిందట. ఈ 41ని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఇక పోటాపోటిగా ఉండే సీట్లు..కాస్త కష్టపడితే గెలిచే సీట్లు 42..వీటిని ‘బి’ కేటగిరీలో పెట్టారు. అటు కాంగ్రెస్ కు గెలిచే అవకాశం లేని సీట్లు 36..వీటిని ‘సి’ కేటగిరీలో పెట్టారు. ఇలా కేటగిరీ వారీగా డివైడ్ చేసుకుని..ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయనున్నారు.

ఇక ఈ నెలలోనే 50 నుంచి 70 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశముంది. మరోవైపు.. కేసీఆర్ కూడా ఈనెలలోనే  87 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బి‌ఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news