ఓడలో చెలరేగిన మంటలు.. 31 మంది దుర్మరణం

-

ఫిలిప్పీన్స్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 250 మంది ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 31 మంది సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగడం గమనించిన కొందరు వెంటనే సముద్రంలోకి దూకారు. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. అగ్నిప్రమాదంలో సుమారు 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్​లో జరిగింది.

జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్​లోని జోలీ పట్టణానికి ఓడ వెళ్తుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయని ప్రావిన్స్​ గవర్నర్​ జిమ్​ హతమన్​ తెలిపారు. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారని.. మంటల కారణంగా భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు.. అగ్నికీలల్లో చిక్కుకుని మరికొందరు మరణించారని వెల్లడించారు. దగ్ధమైన ఓడను బాసిలన్ తీరానికి చేర్చినట్లు చెప్పారు. ఓడ క్యాబిన్​లోనే 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని.. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని వివరించారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని జిమ్​ హతమన్  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news