ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈయన ఈ రోజు వెలగపూడి లోని శాసన మండలి కార్యాలయంలో తన పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయం నుండి కార్యకర్తలు మరియు ఇతర నాయకులతో కలిసి ఒక ర్యాలీ లాగా వెళ్లనున్నారు. కాగా కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న పట్టభద్రుల నియోజకవర్గం నుండి గెలుపొందారు.
అయితే ఈ స్థానంలో ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ గా గెలిచిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు మూడు సార్లు ఎన్నికలు జరుగగా అందులో పిడిఎఫ్ అభ్యర్థులు విజయ కేతనన్ని ఎగురవేశారు. అందుకే ఈ విజయానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అంతే కాకుండా కంచర్ల శ్రీకాంత్ అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఓడించి ఈ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాడు. మరి కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గా ఏమి చేయనున్నాడు అన్నది రానున్న తన పదవీ. కాలంలో చూడాల్సి ఉంది.