కెసిఆర్, ఈటలకు తిన్నది అరగకే.. హుజురాబాద్ ఉప ఎన్నిక : విహెచ్

కేసీఆర్, ఈటల రాజేందర్ లకు తిన్నది అరగకనే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని.. కావాలనే ఒకరిని ఒక్కరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు హన్మంతరావు. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది బల్మూరి వెంకట్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వి.హన్మంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లారి పేపర్ చూస్తే వాళ్లే బొమ్మలే కనిపిస్తున్నాయి.. ఒక పక్క ఈటల మరోపక్క కేసీఆర్, హరీష్ రావు లే కనిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.

మహిళలు బతుకమ్మ ఆడుతుంటే స్పీడ్ గా వచ్చి బతుకమ్మలను తొక్కుకుంటు ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు పోయిందని నిప్పులు చెరిగారు, అటు నల్ల చట్టాలను తెచ్చి నరేంద్రమోడీ.. రైతుల మెడకు ఉరితాడు వేశాడని మండిపడ్డారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతుల పైకి కారు ఎక్కించి రైతుల ప్రాణాల ను పొట్టన పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఆసరా పెన్షన్, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికి ఇవ్వలేదని.. ఎన్నికల కోసమే దళిత బంధు ఇస్తున్నాడని మండిపడ్డారు. దళిత బంధు లాగానే మిగితా కులాలకు కూడా పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కే వోటు వేయాలని కోరారు హనుమంత రావు.