కరోనాను బాగా వాడుకుంటున్న అన్నలు…!

-

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి అలజడి రేగింది. రోజు రోజుకి కరోనా విస్తరించడం తో ఇప్పుడు పెద్ద ఎత్తున బలగాలను మావోయిస్ట్ లు తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి కొన్ని బలగాలను ప్రభుత్వాలు లాక్ డౌన్ కట్టడికి వినియోగిస్తున్నాయి. దీనితో బలగాలు తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మావోలు దాడులకు దిగుతున్నారు. రోజు రోజుకి తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్నారు.

తెలంగాణాలోని కొమరం భీమ్, చత్తీస్ఘడ్ లోని దంతేవాడ, మంచిర్యాల జిల్లాల్లో మావోల కదలికలు మొదలయ్యాయి. మావోయిస్ట్ అగ్ర నాయకత్వం ఆదేశాలతో మావోలు ఇప్పుడు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు,. నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో గత కొద్ది రోజులుగా తుపాకుల మోత మోగుతోంది.

బీజాపూర్ జిల్లాలో గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంద్రిపాల్-ఏటిపాల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నాం సీఆర్‌పీఎఫ్ జవాన్లు, డీఆర్జీ దళాలు గాలింపు చేస్తూ ఉండగా మావోలు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో కొందరు జవాన్లకు గాయాలు కాగా మరికొందరు మావోలకు గాయాలు అయ్యాయి. ఒక మావో మరణించాడు. భారీగా టిఫిన్ బాంబులు, తుపాకులు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news