బీజేపీలోకి మర్రి-పవార్..ఒరిగేది ఏంటి?

-

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఓ వైపు పోరాడుతూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారం దక్కించుకోవాలనే ప్లాన్‌లో బీజేపీ ఉంది. ఇదే క్రమంలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలని బీజేపీలోకి లాగారు.

రానున్న రోజుల్లో మరింత మందికి గాలం వేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..బీజేపీలో చేరుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ సైతం బీజేపీలోకి వస్తున్నారు. వీరు ఢిల్లీలో జే‌పి నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీలోకి వలసలు నడిస్తే..ఆ పార్టీ బలపడుతుందని ఇటీవల కొన్ని సర్వేల్లో తేలింది. ఎందుకంటే బీజేపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకత్వం లేదు.

119 స్థానాల్లో దాదాపు సగం స్థానాల్లో కూడా బలమైన నాయకులు లేరు..పైగా ఉపఎన్నికల్లో గెలవడానికి కారణం బలమైన నాయకులైన రఘునందన్, ఈటల రాజేందర్‌లు. మునుగోడులో కూడా గట్టి పోటీ ఇవ్వడానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి అలా అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు కావాలి. కానీ ఇప్పటికిప్పుడు కింది స్థాయి నుంచి నాయకులని తయారు చేయడం కష్టమైన పని..కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో ఉండే బలమైన నేతలని లాగాలి.

అయితే మర్రి, పవార్ లాంటి నేతల వల్ల పెద్ద ప్రభావం ఉండదనే పరిస్తితి. ఒకప్పుడు మర్రి బలమైన నేత..కానీ ఇప్పుడు ఔట్‌డేటెడ్ అవుతున్నారు. సనత్‌నగర్ స్థానంలో ఆయన హవా తగ్గింది. అటు పవార్ వచ్చి గత ఎన్నికల్లో ముధోల్‌లో పోటీ చేసి 36 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. ఈయన కంటే బీజేపీ నుంచి పోటీచేసిన రమాదేవి 40 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో ఉన్నారు. కాబట్టి ఇంకా బలమైన నేతలపై బీజేపీ ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news