పాతికేళ్ళ ఒక మహిళ తాను మహిళను కాను పురుషుడిని అని తెలుసుకుంటే ఎలా ఉంటుంది ? ఆమెతో పాటు అందరూ షాక్ అవ్వాల్సిందే కదా. నిజంగా అలాగే జరిగింది. చైనాలోని బీజింగ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన పింగ్‌పింగ్ అనే అమ్మాయికి కౌమార దశ వచ్చినా ఋతుస్రావం మొదలు కాలేదు. వైద్యులను సంప్రదిస్తే.. శరీరములో ఎదుగుదల నెమ్మదిగా ఉందని.. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని చెప్పారు. దీంతో ఆ మహిళకి పెళ్లి కూడా చేశారు.
గత కొంతకాలంగా ఆమె సంతానం కోసం ప్రయత్నిస్తున్నా గర్భం దాల్చలేదు. మరో అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన ఆమెకు టెస్టులు చేయగా అందులో విస్తుపోయే విషయం తెలిసింది. అదేమంటే ఆమెకు గర్భసంచి, అండాశయం లేదని కూడా తేలింది. ఆ మహిళ జన్యులోపాలతో పుట్టడంతో బయటకు మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా ఆమె పురుషడని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఆమెకు రుతుస్రావం కావట్లేదు అని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు రక్తసంబంధీకుల కావడం వల్ల ఈ జన్యులోపం తలెత్తిందని చెప్పారు.