Mass maharaja: మెగాస్టార్ తో రవితేజ ఇట్స్ అఫీషియల్!

-

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(154) కథానాయకుడిగా”వాల్తేరు వీరయ్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈనెల 14 (గురువారం) నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లో హాజరుకానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా రవితేజ నటన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా చిరంజీవి సినిమాలలో రవితేజ “గుండారాజ్”, “శంకర్ దాదా జిందాబాద్”, “అన్నయ్య” వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. కాగా ఈ సినిమాలో రవితేజకు సంబంధించిన ఓ చిన్నపాటి టీజర్ ని విడుదల చేసి చిత్ర బృందం.’ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్ ‘ అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ని విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news