అదో వింతరోగం.. మనసారా నవ్వలేదు..ఏడ్వలేదు..దినదినగండం నూరేళ్ల ఆయుష్షు

-

మనస్పూర్తిగా నవ్వితే ఎన్ని టెన్షన్స్‌ ఉన్నా ఇట్టే రిలీఫ్‌ వస్తుంది. మనసారా ఏడిస్తే…బాధ బారం కొంతైనా తగ్గుతుంది అంటారు. కానీ ఆ యువతి ఏడ్చినా, నవ్వినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తను ఏడవలేదు, నవ్వలేదు. భావోద్వేగాలను భరించాల్సిందే తప్ప వ్యక్తపరచడానికి లేదు. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌కి చెందిన 27 ఏళ్ల నటాషా కోట్స్ ఓ వింత వ్యాధితో పోరాడుతోంది. వ్యాధి పేరు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్.

నటాషా ఎక్కువ ఉద్వేగానికి లోనైనప్పుడు, నవ్వినా లేదా కన్నీళ్లు వచ్చినప్పుడు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. నొప్పి మరింత తీవ్రమవుతుంది.. ఒకొక్కసారి మరణం అంచుకు చేరుకుంటుందట. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆస్తమా, అలర్జీ అండ్ ఇమ్యునాలజీ నివేదిక ప్రకారం.. మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అనేది ఇమ్యునోలాజికల్ డిజార్డర్. దీని కారణంగా రోగిలో అలర్జీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీని లక్షణాలు శరీరం అంతా ఉంటాయి.

రోగులలో ఉండే మాస్ట్ కణాలు కొన్ని రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు అలెర్జీని కలిగించమే కాదు.. కడుపు, గుండె, శ్వాస , మెదడుపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిగల వ్యక్తి భావోద్వేగంలో మార్పు అధికంగా ఉంటే.. ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి.

500 సార్లు ఆసుపత్రి పాలైన నటాషా

500 సార్లు ఆసుపత్రి పాలైన జిమ్నాస్ట్ నటాషా నటాషా వృత్తిరీత్యా జిమ్నాస్ట్. నటాషాని చెమట, నవ్వు కూడా చంపగలవట. ఈ కారణంగా ఆమె దాదాపు 500 సార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.. తాను ఎటువంటి భావోద్వేగాలైనా అలర్జీ వస్తుంది. నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, విచారంగా లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఇలా ప్రతిచర్య శరీరానికి అలర్జీని కలిగిస్తుందని యువతి తెలిపింది. నవ్వు, ఒత్తిడితో మాత్రమే కాదు, పెర్ఫ్యూమ్‌లు, క్లీనింగ్ కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా నటాషాకు అలెర్జీని కలిగిస్తాయి.

ఇది అరుదైన వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా నయం కాదు. రోగి పరిస్థితి క్షీణించినప్పుడు, వివిధ రకాల మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఉపశమనం లభిస్తుంది..

పాపం ఆ యువతి తన జీవితం అంతా ఇలా భావోద్వేగాలను వ్యక్తపరచకుండా ఉండిపోవాల్సిందే..నవ్వు, ఏడుపు అంటే ఎలాగోలా కంట్రోల్‌ చేసుకోవచ్చు..కానీ ఒత్తిడి ఇది మనకు తెలియకుండానే ఆగం ఆగం చేస్తుంది. మాములు వ్యక్తులకే భరించలేని ప్రజర్‌ ఉంటుంది. ఇక ఆమె వీటన్నింటిని కంట్రోల్‌ చేసుకుంటూ వస్తుందంటే గ్రేట్‌ అనే చెప్పాలి!

– Triveni Buskaro0wthu

Read more RELATED
Recommended to you

Latest news