ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని ఏ విధంగా అయినా సరే తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజధాని తరలింపు కోసం ఏదైనా చెయ్యాలని ఆయన భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఆయన స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చేసారు. అయితే ఆయన శాసన మండలిలో అడ్డు తగిలింది.
అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా మండలిలో సెలెక్ట్ కమిటికి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో జగన్ కి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇక ఇక్కడి నుంచి జగన్ వ్యూహం మార్చారు. ఇటీవల ఆయన రాజధాని కేసుల మీద వాదించడానికి గాను ముకుల్ రోహాత్గీ అనే లాయర్ ని నియమించుకున్నారు. ఆయన సలహాలు తీసుకునే మండలిని ఏ విధంగా రద్దు చేయించాలో ముందుకి వెళ్తున్నారు.
ఇప్పుడు ఆయన సలహాలతో రాజధాని తరలింపు విషయంలో జగన్, బిల్లు కాదు జీవో అంటున్నారట. జీవో తీసుకొస్తే చాలని బిల్లు అనేది ఒక రిస్కీ వ్యవహారమని ముకుల్ జగన్ కి సలహా ఇచ్చారట. అందుకే జగన్ ఇప్పుడు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదని, ముఖ్యమంత్రి కూర్చున్నదే రాజ్యాంగం అని చెప్తూ జయలలిత ఊటీలో ఉన్నదీ, చంద్రబాబు వైజాగ్ లో ఉన్నదీ ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసారు.