పెద్ద స్టార్ కోసం ప్రయత్నం చేస్తున్న మహర్షి డైరెక్టర్..

-

మహర్షి సినిమా తర్వత వంశీ పైడిపల్లి మరో సినిమాని ప్రకటించలేదు. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనుకున్నప్పటికీ సడెన్ గా ఆ అవకాశం పరశురామ్ కి వెళ్ళిపోయింది. దాంతో వంశీకి మహేష్ ని రెండవ సారి డైరెక్ట్ చేసే అవకాశం మిస్సయ్యింది. అప్పటి నుండి వంశీ పైడిపల్లి తన తర్వాతి సినిమా కోసం హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట. ఐతే ఇప్పటి వరకూ ఎవరితోనూ సినిమా సెట్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి పవర్ స్టార్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాడట.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. కొత్త కథలు ఎంచుకుని సినిమాలని తెరకెక్కించడానికి రెడీగా ఉంటున్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాలని చూస్తున్నాడట. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నప్పటికీ, వంశీ తన ప్రయత్నం ఆపట్లేదట. మరి వంశీ పైడిపల్లి ప్రయత్నాలు ఫలించి పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం వస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news