కార్యాలు దిగ్విజయం కావాలంటే ఈ వ్రతం చేయండి !

-

మానవుడు జీవితం అంతా సంతోషమయం కాదు. అప్పుడప్పుడు సమస్యలు,కొందరిక ఎప్పుడు సమస్యలు వస్తాయి. అయితే వీరికి దైవానుగ్రహం తక్కువ ఉండటమే కారణం. దీనికి పరిహారం పెద్దలు చెప్పినది శ్రీఘ్రంగా అనుగ్రహించే వినాయక పూజ చేయడమే. దీనిలో అత్యంత విశేషమైన సంకష్టహర చతుర్థి అయితే మరీ విశేష ఫలితాన్నిస్తుంది. ఈ తిథి ఎప్పుడు వస్తుంది తెలుసుకుందాం…

వినాయకుడికి అత్యంత ముఖ్యమైన తిథి చవితి. ప్రతినెలలో రెండుసార్లు చవితి వస్తుంది. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలిగించే సంకట హర చతుర్థి వ్రతాన్ని పలు ప్రాంతాలలో ఎక్కువగా ఆచరిస్తుంటారు. సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. ఇది చాలా విశేషమైన పర్వదినంగా పరిగణిస్తారు. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు, చేసే పనులలో సంకటములన్నీ తొలగి విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. ఈరోజు పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజ చేస్తే వినాయకుడి అనుగ్రహం కలగడంతోపాటు అనేక శుభఫలితాలు వస్తాయి.

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news