గుడ్ న్యూస్: మాక్స్ వెల్ తండ్రి కాబోతున్నాడోచ్ !

-

ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు తరపున అదరగొడుతున్న స్టార్ ప్లేయర్ మాక్స్ వెల్ కు గత సంవత్సరమే వివామైన సంగతి తెలిసిందే. కాగా ఇతను భారత సంతతికి చెందిన మహిళ వినీ రామన్ ను పెళ్లాడడం గమనార్హం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాక్స్ వెల్ త్వరలోనే తండ్రి పదవిని చేపట్టనున్నాడు. మాక్స్ వెల్ భార్య వినీ రామన్ ప్రస్తుతం గర్భవతిగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. కాగా ఈమె డెలివరీ అయ్యే నెల సెప్టెంబర్ అని కూడా మాక్స్ వెల్ ప్రకటించాడు. దీనితో మాక్స్ వెల్ అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆనందాన్ని పంచుకుంటున్నారు.

కాగా బెంగుళూరు హత్తులోని సభ్యులు అంతా పార్టీ ఇవ్వమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆనంద సమయంలో బెంగుళూరు ను ఈ సీజన్ లో మాక్స్ వెల్ ప్లే ఆఫ్ కు చేర్చే ఇన్నింగ్స్ ను ఆడుతాడని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news