తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు నెగెటివ్ గా తేలింది. ఇటీవల శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొంటూ ఓ హోటల్లో టీ తాగారు. రామ్మోహన్ తాగిన టీ దుకాణంలోని టీ మాస్టర్ కు గతంలో కరోనా సోకగా, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే ముందు జాగ్రత్తగా మేయర్ కు కరోనా పరీక్షలు చేయగా..నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు సిబ్బంది.