ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ ప్రచారం సాగించడంతో… ఢిల్లీలో మళ్లీ గెలిచేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. ఆల్రెడీ సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపినా… బీజేపీ ఏ స్థాయిలో పోటీ ఇస్తుందన్నది చర్చనీయాంశమైంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకూ ఇవాళ పోలింగ్ జరగబోతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది.
ఇదిలా ఉంటే రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నేపధ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం పలు వెసులుబాట్లను కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండానే ఓటు వేసే అవకాశాన్నికల్పించారు. వీరంతా పేపర్ బ్యాలెట్ సాయంతో ఓటువేయవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. దీనికితోడు ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా.