మల్కాజ్ గిరి జిల్లా ప్రజలకు శుభవార్త: జూన్ 8, 9, 10 న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 2023…

-

మేడ్చల్ మరియు మల్కాజ్ గిరి జిల్లా ప్రజలకు ఆ జిల్లా మత్స్య శాఖ అధికారి శుభవార్తను అందించారు. జూన్ నెలలో మృగశిర కార్తి నెల ప్రారంభం కానున్న సందర్భంగా ఈయన బాగా అలోచించి జూన్ తేదీలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ను నిర్వహించనున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం శామీర్ పేట పెద్ద చెరువు దగ్గర 10 స్టాల్ లను ఏర్పాటు చేసి ఈ మేళాను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్టాల్ లలో సీ ఫుడ్ ఐటమ్స్ ను ఘుమఘుమలాడే విధంగా తయారుచేసి ఉంచనున్నారు. అందులో చేపల వంటకాలు, రొయ్యల వంటకాలు, పీతల వంటకాలు మొదలైనవి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూస్తే… స్థానికంగా దొరుకుతున్న చేపలు, రొయ్యలు లాంటి ఆహారపు వినియోగాన్ని పెంచడానికి అని స్పష్టంగా అర్ధమవుతోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా మంచి పోషక విలువలు మన శరీరానికి అందడంతో అటుగా , ఆరోగ్యం మెరుగవుతుంది.

ఇతర అనారోగ్య బారి నుండి వీటిలో ఉండే విటమిన్ లు, ప్రోటీనులు మనల్ని కాపాడుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన వీటిని అమ్ముకుని జీవనాన్ని కొనసాగించే వారికి ఉపాధి మార్గం అవుతుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఈ సముద్రపు ఆహారాలు తీసుకునే సగటు ఒక వ్యక్తి 8.7కేజీలు మాత్రమే ఒక సంవత్సరానికి తీసుకుంటున్నారు. కాగా ఈ సగటును ఏకంగా 12 కేజీలు సంవత్సరానికి పెంచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఈ స్టాల్ ల ఏర్పాటు కొరకు తాగు వంటకాలను తయారు చేయడం కోసం అవసరం అయిన మహిళలను మత్స్యకార అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఫెస్టివల్ కు మహిళా మత్య్స పారిశ్రామిక సంఘాలు, నిథమ్ లో శిక్షణ తీసుకున్న మహిళలు, మొబైల్ షిప్ రిటైల్ లబ్ధిదారులు ఇక్కడకు వచ్చి ఈ సముద్రపు ఆహారపు వంటకాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అన్నీ దగ్గరుండి చూసుకునే బాధ్యతను జిల్లా మత్స్య శాఖాధికారిని అయిన పూర్ణిమ గారు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news