తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నో ఎంట్రీ..

-

తెలంగాణ స‌చివాల‌యంలోకి మీడియాను తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నిషేధించారు. మీడియా వాళ్ళెవరూ సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. దీంతో సీఎస్‌ ఎస్కే జోషిని కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మీడియాపై నిషేధం ప్రభుత్వ నిర్ణయమని, ఆపడానికి తానెవరిని, తాను ప్రభుత్వ సర్వెంట్‌ను మాత్రమేనని సీఎస్, జర్నలిస్టులకు బదులిచ్చారు. మూడు నెలల్లో రిటైర్‌ అయ్యేవాడినని, మీడియాను అనుమతించొద్దని ప్రభుత్వం చెప్పిందని చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ వాళ్లు ఓ స్టైల్‌లో నిరసనలు చేస్తున్నారని, మీ స్టైల్‌లో మీరు నిరసనలు చేసుకోండని జర్నలిస్టులకు జోషి చెప్పారు. అయితే గతంలో కూడా కేసీఆర్ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ త‌ర్వాత మీడియా నుండి నిరసనలు ఎదుర్కొని.. తూచ్! మీడియాపై నిషేధం విధించలేదు అని సర్ది చెప్పుకోవాల్సి వ‌చ్చింది. మ‌రి ఈ సారి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news