మంచు హీరోల మార్కెట్ జీరో … అయినా భారీ కాస్టింగే

-

మంచు ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరి పరిస్థితీ బాగా లేదు. బహుముఖ పాత్రలతో లెజెండరీ స్టేటస్ అందుకున్న మోహన్ బాబు.. సరిగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుని ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న విలన్-క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండేవారేమో. కానీ మోహన్ బాబుకు ఆసక్తి లేదో, ఓపిక లేదో కానీ.. జనాలు ఆయన గురించి మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇక మోహన్ బాబు కొడుకులు, కూతురి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరిలో ఎవరి పరిస్థితి బెటరో కూడా చెప్పలేం. ఆ స్థాయిలో ముగ్గురూ జీరోలైపోయారు.

మంచు విష్ణు నుంచి పోయినేడాది వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ పైసా కూడా వెనక్కి తేలేదు. ఈ ఏడాది ‘ఓటర్’ అనే సినిమా వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. విష్ణు సినిమాను రిలీజ్ చేస్తే తొలి రోజు నుంచే నెగెటివ్ షేర్ వస్తోందంటే విచారించాల్సిన విషయమే. ఇలాంటి స్థితిలో మంచు విష్ణు బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద కాస్టింగ్, టెక్నికల్ సపోర్టుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాాడు.

విష్ణు రేంజికి వీళ్లే చాలా ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడాా తోడయ్యాడు. తాజాగా సునీల్, సంజయ్‌లతో కలిసి ఉన్న ఫొటో ఒకటి మంచు విష్ణు పంచుకుంటూ.. వీళ్లతో కలిసి పని చేస్తున్న విషయాన్ని ధ్రువీకరించాడు. విష్ణు ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న నేేపథ్యంలో కాజల్, సునీల్, సంజయ్ ఒకే సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది. కానీ ఇప్పుడు విష్ణు ఉన్న స్థాయికి వీళ్లతో జట్టు కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. విద్యా నికేతన్ సహా వేరే మార్గాల్లో మంచు కుటుంబానికి భారీగా ఆదాయం వస్తుండటంతో సినిమాల్లో ఎన్ని కోట్లు పోయినా వాళ్ల ప్రయత్నాలు ఆగట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news