బ్రేకింగ్‌: కోహ్లీ 254 నాటౌట్‌… ఇండియా 601… పీక‌ల్లోతు క‌ష్టాల్లో స‌పారీలు

-

సౌతాఫ్రికాతో పుణే వేదిక‌గా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 వికెట్లతో రెండో రోజు బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి ఇది ఏడవ డబుల్ సెంచరీ. అలాగే టెస్టుల్లో 7 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్ మాన్ అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు చేసి అందరికంటే ముందున్నాడు.

ఇక అజ్యంకా రహానే హాఫ్ సెంచ‌రీ చేసి ఔట‌య్యాక వ‌చ్చిన ర‌వీంద్ర జడేజా 91 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా 156 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 601 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక వీరాట్ కోహ్లీ 33 ఫోర్లు,2 సిక్సులతో చెలరేగా ఆడుతూ 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆ వెంట‌నే బ్యాటింగ్ ప్రారంభించిన స‌పారీ టీం 30 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news