BREAKING : మరికాసేపట్లో జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..సమావేశానికి పోసాని

-

మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం జరుగనుంది. టాలీవుడ్‌ స్టార్లు అయినటు వంటి చిరంజీవి, ప్రభాస్‌, జూ. ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం వైయస్ జగన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు టాలీవుడ్‌ స్టార్లు స్పెషల్‌ ఫ్లైట్‌ లో బయలు దేశారు.

సినిమా టికెట్ల ధర, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా…నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలను పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా టికెట్ల ధరలు పెంచాలని ప్రాథమిక సిఫారసులు చేసినట్లు సమాచారం అందుతోంది.

పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫారసుల పై సినీ ప్రముఖులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఎంత మేర టికెట్ల ధరలను పెంచాలని దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ శుభవార్త మాత్రం చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news