బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మెగా స్టార్..!

-

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలు అందరూ కూడా ఆత్మీయతకు అనుబంధంగా ఒక చోట చేరి ఆటపాటలతో బతుకమ్మ పండుగను సందడిగా చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరు మహిళలందరికీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

“బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను. ” అంటూ చిరు తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news