తన అనారోగ్యం గురించి..తాజాగా నటి సమంత ఓపెన్ అయ్యింది. మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది.
దీంతో సమంత కోలుకోవాలని కోరిన వారిలో టాలీవుడ్ స్టార్స్ నాని, తారక్, బండ్ల గణేష్, తమన్ వంటి వారు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఆయన తాజాగా సమంత ఆరోగ్యం గురించి తెలుసుకుని, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా చిరు, “సమయం మారుతున్న కొద్దీ మన జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. మనలోని శక్తిని బయటపెట్టేందుకు ఇవి వస్తాయి. నువ్వు చాలా మంచి అమ్మాయివి, నీలో ఉన్న శక్తి అద్భుతమైనది. నువ్వు ఈ ఛాలెంజ్ ను కచ్చితంగా నెగ్గుకోస్తావని నాకు నమ్మకం. నువ్వు ధైర్యంగా పట్టుదలతో ఉండాలని కోరుతున్నాను,” అంటూ పోస్ట్ చేశాడు చిరంజీవి.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022