మెగాస్టార్ “భోళా శంక‌ర్‌”.. టైటిల్ లాంచ్ చేసిన సూపర్ స్టార్ మ‌హేష్ బాబు

ఆగస్టు 22.. రాఖీ పండగ.. అందరూ అన్నయ్యగా పిలిచే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఒకే రోజు రెండు పండగలు.. అభిమానులకు బహుమతిగా ఏదైనా ఇవ్వడానికి ఇంతకన్నా అద్భుతమైన రోజు ఇంకోటి లేదు. అందుకే మెగా అభిమానులతో పాటు సినిమా అభిమానులందరినీ అబ్బుర పరిచే, ఆసక్తి కలిగించే అప్డేట్ తో చిరంజీవి వస్తున్నారు. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న సినిమా అప్డేట్ ఇప్పుడే బయటకి వచ్చింది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా టైటిల్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసారు.

bolashankar

” భోళా శంక‌ర్‌ ” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్ చూస్తుంటే దైవంతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాగ్రౌండ్ లో బ్రిడ్జి, భవనాలు సినిమా నేపథ్యాన్ని చెబుతున్నట్టుగా ఉన్నాయి. కాకపోతే సినిమా కథపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భోళా శంకర్ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ తో షాడో తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. షాడో సినిమా వచ్చి 8సంవత్సరాలు దాటిపోయింది. మొత్తానికి మెహెర్ రమేష్ కు మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ రావడం అదృష్టమనే చెప్పాలి.