చేతిలో వైన్ గ్లాస్ తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న మెహ్రీన్..!

-

ఇటీవల ఎఫ్ 3 సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మెహరీన్ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్ లో అందాల విందు చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేయగా అవి బాగా వైరల్ అవుతున్నాయి. సినిమాల కోసం పెళ్లినే వద్దనుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇలా అప్పుడప్పుడు సమయం దొరికితే చాలు మాల్దీవ్ వెకేషన్ కి వెళ్లి చిల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మాల్దీవుల్లో సన్ సెట్ సమయాన గ్లామర్ షో తో సూర్యుడికి చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె అందాల ఆరబోతకు హద్దులు లేవన్నంతగా మైమరపిస్తోంది.

తాజాగా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని బోటుపై సముద్రంలో పరువాలను ప్రదర్శించి గ్లామర్ హీట్ తో సముద్రపు నీరు కూడా వేడెక్కింది. తన మత్తు చూపులతో మైమరిపించే ఫోజులతో యువత సైతం అదరహో అనేలా చేస్తుంది ఈ ముందుగుమ్మ

.

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాచురల్ స్టార్ నాని సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నార్త్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది.

అలా రాజా ది గ్రేట్ , కవచం, ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది . మెహరీన్ అటు తెలుగుతోపాటు తమిళ్ పంజాబీ చిత్రాలలో కూడా నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో రూపొందుతున్న బైలింగ్వల్ ఫిలిం స్పార్క్ లో నటిస్తోంది. అలాగే కన్నడ ఫిలిం నీ సిగువరేగు చిత్రంలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Read more RELATED
Recommended to you

Latest news