బాలయ్య సరసన ఎఫ్‌3 భామ..

-

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మెహ్రీన్‌. అయితే ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే అగ్రహీరోల సరసన నటించింది. అయితే.. ‘ఎఫ్ 2’ తరువాత మెహ్రీన్ కొన్ని సినిమాలు చేసింది .. అయితే ఏ సినిమా కూడా ఆమెకి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘ఎఫ్ 3’ పైనే ఉన్నాయి. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పడం ఆమెకి ఊరటనిచ్చే అంశం. అయితే ఈ లోగా ఆయన బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Mehreen Pirzada Wiki, Biography, Age, Family, Career, Images

ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ కథ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల చేయనుందని ఆయనే అన్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆయన మెహ్రీన్ ను తీసుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో తన మార్కు కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. దసరాకి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news