కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది ఎన్ఐఏ కోర్ట్. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కోర్ట్ ఈ శిక్ష విధించింది. యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ గట్టిగా వాదించింది. అయితే కోర్ట్ మాత్రం యావజ్జీవ శిక్ష విధించింది. కాశ్మీర్ లో ఉగ్రవాదులకు నిధులు చేకూర్చినట్లు యాసిన్ మాలిక్ ఒప్పుకున్నాడు. యాసిన్ మాలిక్ ను ఈ నెల 16న కోర్ట్ దోషిగా తేల్చింది. తాజాగా శిక్ష విధించింది.
యాసిన్ మాలిక్‌కు రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10 లక్షల జరిమానా, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయబడతాయని కోర్ట్ తీర్పు చెప్పింది. యాసిన్ మాలిక్ తో పాటు పలువురు వేర్పాటువాదుపై కూడా ఎన్ఐఏ అభియోగాలు మోపింది. కాశ్మీర్ లో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని యాసిన్ మాలిక్ టెర్రరిస్టులను ప్రోత్సహించాడు. ఈ కేసులో లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ లపై కూడా ఎన్ ఐ ఏ ఛార్జీషీట్ ఫైల్ చేసింది.