సిఎం ఎక్కడుంటే అదే రాజధాని : ఏపీ మంత్రి

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని పై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని… మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు..రేపు మరో ప్రాంతం కావచ్చని మంత్రి మేకపాటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రెటరియేట్.. అదే రాజధాని అని వివరించారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు మంత్రి మేకపాటి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరూ అడ్డు కోలేరని వివరించారు. దీని పై ప్రతి పక్షాలది అర్ధం పర్ధం లేని వాదనలని ఫైర్‌ అయ్యారు. కాగా.. ఏపీ రాజధాని పై వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి గందర గోళ పరిస్థితులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.