పూరి జగన్నాథ్‌ పై ఈడీ ప్రశ్నల వర్షం…వెలుగులోకి షాకింగ్‌ నిజాలు !

టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం నుంచి 5 గంటలుగా ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్ ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడి జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని పరిశీలిస్తున్న ఈడీ అధికారులు… 2015 నుండి అకౌంట్ స్టేట్మెంట్ లను పరిశీలిస్తున్నారు.

చార్టెడ్ అకౌంట్ సమక్షంలో ఈడి అధికారులకు వివరిస్తున్న పూరి జగన్నాథ్.. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించారు ఈడీ అధికారులు. అలాగే… విదేశీ లావాదేవీల గురించి పూరి జగన్నాథ్‌ను ఆరా తీస్తున్నారు అధికారులు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన ల పై ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు పూరిని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం భోజనం విరామం తీసుకున్నారు ఈడీ అధికారులు. సంచ్‌ బ్రేక్‌ అనంతరం విచారణ మళ్లీ ప్రారంభించనున్నారు.