లింగ నిష్పత్తిలో మహిళలు టాప్…కారణం అదేనంటున్న కేంద్ర మంత్రి..!

-

దేశంలో లింగనిష్పత్తి లో మళ్లీ మహిళలు టాప్ లోకి వచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్ సభలో వెల్లడించారు. పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని జాతీయ ఆరోగ్య సర్వే తెలిపిందని స్త్రీ పురుష నిష్పత్తిలో 1020 : 1000 గా ఉందని వెల్లడించారు. వెయ్యి మంది పురుషులకు గాను 1020 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

అంతే కాకుండా బెటి బచావో భేటీ పడావో లాంటి పథకం వల్లే మళ్లీ మహిళల సంఖ్య పెరిగింది అన్నారు. బిజెపి సర్కార్ తీసుకువచ్చిన ఈ పథకం మహిళల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఇదిలా ఉండగా గతంలో మహిళల కంటే పురుషుల నిష్పత్తి ఎక్కువగా నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా తాజా సర్వే పై అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది దీన్ని ఫేక్ సర్వే అని కొట్టి పారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news