ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గోవాకు వెళ్లనున్నారు. గోవాలో జరగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. గోవా లోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో లిబరేషన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత భూభాగ లైన గోవా, డామన్ అండ్ డాయ్యు ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961 సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ లో పాల్గొన్న వారిని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సత్కరిం చనున్నారు.
భారతదేశానికి 1947 సంవత్సరం లో స్వతంత్రం వచ్చినా…గోవా, డామన్ అండ్ డాయ్యు.. ఈ రెండు ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనం లోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తి చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. చివరికి 1961 సంవత్సరంలో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ నుంచి విముక్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా గోవా లిబరేషన్ ను ఆ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు.