స్టేజ్ పైనే ఏడ్చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్

నాచురల్ స్టార్ నాని తాజాగా చేస్తున్న మూవీ శ్యామ్ సింగరాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా లో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదిక లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది.

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్.. సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరూ అరవడం మొదలు పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేక సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది. అనంతరం సాయిపల్లవి స్వయంగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. సెల్ఫీ కోసం అభిమాని స్టేజ్ పైకి వచ్చాడు. అప్పుడు కూడా సాయి పల్లవి చాలా ఎమోషనల్ అయ్యింది. మీ అభిమానం వల్లనే ఇంత స్థాయికి వచ్చాను అంటూ సాయి పల్లవి పేర్కొంది.