పిల్లలకు కోడిగుడ్డు ఆహారంగా ఇవ్వొదంటున్న మేనకా గాంధీ..!

-

రోజూ ఒక కోడిగుడ్డు తినమని వైద్యుల నుంచి మొదలు అందరూ చెప్పే మాటే. ! పౌష్టికాహార లోపం నుంచి బయటపడాలంటే.. ఈరోజుల్లో గుడ్డు తినాల్సిందే అంటున్నారు. కానీ కొందరు మాత్రం గుడ్డు వద్దే వద్దంటున్నారు. బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ గుడ్డును తీసుకోవద్దంటూ ఏకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు.. అందుకు ఆమె చెబుతున్న కారణమేంటి..?
సండే లేదా మండే రోజూ తినండ గుడ్డు అని నేషనల్‌ ఎగ్‌కో ఆర్డినేషన్ కమిటీ ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.. రోజుకో గుడ్డును తీసుకుంటే కావాల్సిన పోషకాలు అందుతాయని నిరూపితమైంది. ఓ మనిషికి ఒక రోజుకు కావాల్సిన ప్రోటీన్లు ఓ గుడ్డు ద్వారా అందుతాయని, ఏ వయస్సు వారైనా గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే అనారోగ్యం ధరి చేరదని వైద్యుల మాట. అందుకే ప్రభుత్వ పాఠశాల్లో చదివే పిల్లలకు గుడ్డును తప్పకుండా అందజేస్తున్నారు.
అయితే కోడిగుడ్డుపై బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకాగాంధీ కొత్త ముచ్చట చెప్తున్నారు. గుడ్డును అసలు తినకూడదంటున్నారు.. పిల్లలకు గుడ్డును ఆహారంగా ఇవ్వకూడదట. హైదరాబాద్‌లో జరిగిన శ్రీ జైన సేవా సంఘ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గుడ్డుపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. కోడి రుతుస్రావం ద్వారా వచ్చే రక్తంతో గుడ్డు తయారవుతుందని ఇది తినడానికి సరిపోదని ఆమె అంటున్నారు. అందువల్ల పిల్లల పౌష్టికాహారం కోసం గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రోత్సహించడాన్ని నిరసించాలట. గుడ్డు బదులు రెండు చెంచాల పప్పులో అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని అంతేకాకుండా గుడ్డు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని ఆమె తెలిపారు.
ఇక నుంచి గుడ్డు తినవద్దంటూ ప్రచారానికి పూనుకోవాలని ఆమె పిలుపునిచ్చింది. అలాగే మాంసాన్ని బహిరంగంగా విక్రయించడం, జంతు వధ, పంజరాల్లో పక్షులను ఉంచడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. వీటన్నింటినీ ప్రశ్నించడం ద్వారానే అరికట్టవచ్చు అంటున్నారు.. ఏదేమైనా గుడ్డుపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నారు. ఇంతకీ ఆమె స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయం ఏంటో..?
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news