మగవారిలో సంతాన ప్రాప్తి ని ప్రభావితం చేసే అంశాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

-

ఆడవారి సంతాన సమస్యల గురించి జరిగినంత చర్చ మగవారి సంతాన ప్రాప్తి గురించి జరగదు. ఎందుకో తెలియదు కానీ ఈ విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం మగవారిలో సంతాన ప్రాప్తిని ప్రభావితం చేసే అంశాల గురించి చర్చిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

సంతాన ప్రాప్తిని ప్రభావితం చేసే అంశాలు

ఒత్తిడి, శ్రమలేని జీవన విధానం

ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందులో పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ ఒత్తిడి కారణంగా టెస్టోస్టిరాన్, వీర్యకణాలు తగ్గిపోవడం సంభవిస్తుంటుంది. ఇంకా, ఎలాంటి శారీరక శ్రమ చేయని వారిలోనూ ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి.

పదార్థాల సేవనం

ఆల్కహాల్, పొగాకు కూడా సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కారణంగా ఉంది. వీర్యకణాల సంఖ్య పడిపోవడం ఇందులో మొదటిది.

విష పదార్థాలకి దగ్గరగా ఉండడం

క్రిమి సంహారక మందులు, రేడియో ఆక్టివిటీ రసాయనాలు, భార లోహాలు శరీరంపై ప్రభావం చూపి పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద దాడి చేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

సంతాన ప్రాప్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి?

సరైన జీవన విధానం

వాకింగ్, జాగింగ్, రన్నింగ్ మొదలైన శారీరక శ్రమ చేయాలి. సరైన ఆక్టివిటీ శరీరన్ని ఉత్తేజంగా ఉంచుతుంది. దానివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాదు హార్మోన్లు సరిగ్గా విడుదల అవుతాయి.

ఆహారం

పండ్లు, కూరగాయలు, కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకపోతేనే చాలా మంచిది.

శుభ్రత

శుభ్రత కూడా సంతాన ప్రాప్తిని ప్రభావం చేస్తుంది. మూత్రవిసర్జన చేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, మరీ బిగుతుగా ఉండకుండా కొంచెం వదులుగా ఉండే లోదుస్తులని వాడడం అన్నీ శుభ్రత కిందకే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version