భూమి మీద బంగారం మొత్తం ఎంత విలువ ఉంటుందో ఆ గ్రహ శకలం విలువ కూడా అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే సుమారు రూ. లక్ష కోట్ల కోట్ల డాలర్లు. మార్స్‌కు గురుగ్రహానికి మధ్యలో ఉన్న ’16 సైక్’ అనే అత్యంత అరుదైన లోహపు ఆస్టరాయిడ్ విలువ ఇది. దానిపై ఇనుము, నికెల్, బంగారం లోహాలు ఉన్నాయన్న అంచనాతో పరిశోధకులు దానికి ఈ విలువను ఆపాదించారు.
సైకు అధ్యయనం చేసేందుకు గాను నాసా వ్యోమనౌకను ప్రయోగించింది. అయితే.. భూమికి 230 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ‘16 సైక్’ను హబుల్ టెలిస్కో్‌పతో మొదటిసారి అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు అమెరికాలోని సౌత్‌వె్‌స్ట రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. అయితే.. ‘పూర్తిగా ఐరన్, నికెల్‌తో నిండి వున్న ఈ ఆస్టరాయిడ్ విలువ 10 వేల క్వాడ్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఇది చాలా ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని భూమికి తీసుకు రాగలిగితే ప్రతి ఒక్కరు బిలియనీర్లు అవుతారు అని అధ్యయన సారథి, శాస్త్రవేత్త ట్రాసీ బెకర్ పేర్కొన్నారు.