మాండుస్ తుఫాన్ కి ఏపీలోని చాలా జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో.. రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కొన్ని చోట్ల విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరికొన్ని చోట్ల జనాలు ఇల్లు వదిలి రోడ్లపైకి వచ్చేశారు.
మండూస్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. అటు సోమశిల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో 40 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు.