హైదరాబాద్ ప్రయాణికులకు షాక్. మెట్రో ఛార్జీలు పెరుగనున్నట్లు సమాచారం అందుతోంది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ భారంగా పరిణమించింది యాజమాన్యం. ప్రభుత్వపరంగా అందాల్సిన సాఫ్ట్ లోన్ అందకపోవడం మెట్రో కు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చార్జీల పెంపునకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం ఉన్న కనీస చార్జీని రూ.10 నుంచి రూ. 20 కి, గరిష్ట చార్జీని రూ. 60 నుంచి రూ. 80 లేదా రూ. 100 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. చార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు రవాణా సదుపాయం కల్పించకపోవడం, అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ వసతుల లేమి కారణంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదన్నది సుస్పష్టం.