ట్రంప్‌తో చ‌ర్చ‌ల త‌ర్వాతే టిక్‌టాక్ పై నిర్ణయం: మైక్రోసాఫ్ట్..!

-

వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సాఫ్ట్ వెర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. టిక్‌టాక్ కోనుగోలుకు సంబంధించి చ‌ర్చ‌లు కొన‌సాగించిడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉంద‌ని, అయితే ఈ విష‌యంపై అధ్య‌క్షుడు ట్రంప్‌తో సంస్థ సీఈఓ స‌త్య నాదెల్ల చ‌ర్చించిన త‌ర్వాతే ఇది జ‌ర‌గుతుద‌ని ఓ ప్ర‌క‌టన‌లో వెల్ల‌డించింది. అయితే టిక్ టాక్ నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అంటూ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.

భారత్ చైనా యాప్‌లను నిషేధించడాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతించిన విషయం తెలిసిందే. ‘టిక్‌టాక్‌పై దృష్టి పెట్టాం. దాన్ని నిషేధించే అవకాశం కూడా లేకపోలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనుగులు చేసేందుకు ట్రంప్‌ ఒప్పుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news