వీడియో ; ఆహారం కోసం రైలులో హింస…!

-

దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి అందరికి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు లక్షల మంది ఇప్పుడు సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. ఇక ప్రత్యేక రైలు సర్వీసుల్లో వారిని సొంత ఊర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని సత్నాలో జరిగిన ఒక సంఘటన వేదనకు గురి చేస్తుంది.

ఆహారం కోసం వలస కార్మికులు రైల్లో ఘర్షణకు దిగారు. బీహార్‌కు వలస వచ్చిన కార్మికులతో ప్రయాణిస్తున్న రైలు మధ్యాహ్నం సత్నాకు చేరుకుంది, ఆహార౦ పంచుకునే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ రైలు మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి మంగళవారం 1,200 మంది వలస కార్మికులతో బయలుదేరింది. ఆకలితో ఉన్న కార్మికుడు తమకు ఆహారం ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యాడు.

“24 ప్యాకెట్ల ఆహారం పంపిణీ చేయడాన్ని నేను చూశాను. ఆ కంపార్ట్మెంట్ మొత్తం ఆహారాన్ని అందుకుంది. మాకు ఎటువంటి ఆహారం రాలేదు, ప్రజలు ఇక్కడ ఆకలితో ఉన్నారు” అని కార్మికుడు వీడియోలో వ్యాఖ్యానించాడు. మాటల యుద్ధం తర్వాత ఈ ఘర్షణ హింసాత్మక౦గా మారింది. కరోనా భయంతో రైల్వే పోలీసులు కూడా జోక్యం చేసుకోలేదు. రైలులో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news