కరోనా ధాటికి భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూసారు. ఈ నెల 20న ఆస్పత్రిలో చేరిన మిల్కా సింగ్, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పరుగు పోటీల్లో భారతదేశానికి ఎన్నో పతకాలు అందించిన మిల్కా సింగ్ కరోనా ధాటికి బలయ్యారు. ఆయన భార్య నిర్మల ఐదు రోజుల క్రితమే మరణించారు. కరోనా వైద్యం అందుకుంటున్న మిల్కాసింగ్ శుక్రవారం రాత్రి 11:30గంటల ప్రాంతంలో స్వర్గస్తులయ్యారు.
1932సంవత్సరంలో పాకిస్తాన్ పంజాబ్ లోని గోవిందపురంలో జన్మించిన మిల్కా సింగ్, 1958జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఆ తర్వాత కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కి బంగారు పతకాన్ని అందించాడు. 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో 400మీటర్ల పరుగు పందెంలో కొద్ది సెకన్లలో పతకాన్ని మిస్సయ్యాడు. 1959లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మిల్కాసింగ్ జీవితం మీద భాగ్ మిల్కా భాగ్ పేరుతో బాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది.