పల్నాడులో మైనింగ్ మాఫియా…!

గురజాలలో క్వారీ హత్యలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పల్నాడు లో మైనింగ్ మాఫీయా చెలరేగిపోతుందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరులు మైనింగ్ దందా సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నరసరావుపేట కు చెందిన కాసు రౌడీ లు గురజాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

గతంలో ఎన్నడూ లేని విదంగా క్వారీ కార్మికులపై దాడులు చేస్తున్నారని అన్నారు. క్వారీ కార్మికులపై వైసిపి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్దానికేతురుల వల్ల ఇబ్బందులు పడతామని ఎన్నికలు సమయంలోనే చెప్పానని… ఇప్పడు గురజాల నియోజకవర్గం లో అదే జరుగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇలాంటి చర్యలు సహించేది లేదన్నారు.